Thursday, February 9, 2017

One Night with Prostitute


సమయం రాత్రి 7 .30 అప్పుడే నిదుర లేచిన రోహిత్ వాటర్ త్రాగడానికి కిచెన్ లోకి వెళ్ళాడు. ఈ లోపు ట్రింగ్ ట్రింగ్ ..... ట్రింగ్ ట్రింగ్ ..... అని ఫోన్ రింగ్ అవుతింది. అన్నోన్ నెంబర్ ,ఫోన్ లిఫ్ట్ చేసిన రోహిత్ may i know who is this అని అడిగాడు. అటు వైపు నుండి కోకిల గాత్రం తో నా పేరు సంధ్య. నాగేష్ గారు మీకు ఫోన్ చెయ్యమని చెప్పారు అని చెప్పింది. ఓహ్ మై గాడ్! థాంక్స్ ఫర్ కాలింగ్ . ఎక్కడ వున్నారు అని అడిగాడు , నేను మీ ఇంటికి దగ్గర లో ఉన్న bus stop లో ఉన్న అని చెప్పింది . సరే ఇంకో 10 నిమిషాలలో తీసుకువెళ్తా అని ఫోన్ కట్ చేసాడు . సంధ్య ఒక వేశ్య ! రోహిత్ నగేష్ అనె బ్రోకర్ తో సంధ్య ని ఆ రోజు రాత్రి కి బుక్ చేసుకున్నాడు. bus stand లో ఉన్న సంధ్య ని చూసిన రోహిత్ తన్మయానికి లోనయ్యాడు , అంత అపురూపం గా వుంది సంధ్య. రోహిత్ మాసిన గడ్డం తో , పగిలిన కళ్లద్దాలు పెట్టుకుని భయంకరం గా ఉన్నాడు. ఒకరికి ఒకరు పరిచయం చేసుకుని రోహిత్ ఇంటికి బయలుదేరారు. రోహిత్ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఆహ్వానించాడు , హాల్ అంత చెత్త తో నిండిపోయి ఉండేసరికి ఎవ్వరు ఇంటిలో ఉండడం లేదా అని ప్రశ్నించింది , నేను ఒక్కడినే ఉంటున్న అన్నాడు రోహిత్ . గోడల ఫై ఏవేవో రాసున్నాయి , ఇంగ్లీష్ అంతగా రాకపోవడం తో సంధ్య కి అర్ధం కాలేదు ఎం రాసి వుందో . రోహిత్ వాలకం , ఆ ఇంట్లో ని గోడలు చూసి సంధ్య కి భయం గా వుంది మనసులో . ఇద్దరు కలిసి బెడ్ రూమ్ వైపు అడుగులు వేశారు, బెడ్ రూమ్ లో వున్నా బొద్దింకలు చూసి భయం తో సంధ్య రోహిత్ వీపు ని హాగ్ చేసుకుంది. ఏమయిందో తెలియదు రోహిత్ కంటి వెంట కన్నీళ్లు , తెలియని ఆవేశం, కళ్ళు నిప్పుల కుంపటి ల ఉన్నాయి , బలం గా తన చేతితో గోడని తన్నాడు. సడెన్ గా నేలపై కుప్పకూలిపోయాడు ,సంధ్య కి భయం వేసి పెద్దగా అరిచి ఇంటి బయటకి వచ్చింది . కాసేపటికి భయం లోంచి తేరుకుని లోపలకి వెళ్లి అచేతనం గా పడి వున్నా రోహిత్ ని చూసి జాలి తో డాక్టర్ ని పిలిపించింది . డాక్టర్ వచ్చి చెక్ చేసి బీపీ షుగర్ లెవెల్స్ బాగా తగ్గాయని బహుశా ఈ వ్యక్తి గత కొద్దీ రోజులగా ఆహారం తీసుకోడం లేదని చెప్పాడు , హాస్పిటల్ లో జాయిన్ చేసి వైద్యం చేయించాలని చెప్పాడు. సంధ్య దగ్గర వైద్యం చేయించే అంత డబ్బులు లేవు , కానీ మనసులో అల రోహిత్ ని వదిలి వెళ్లిపోవాలని లేదు , డాక్టర్ తొ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యమని చెప్పి డబ్బులు తీసుకు రావడానికి బయటకు వెళ్ళింది. సమయం రాత్రి 9 .30 , అప్పుడే క్లోజ్ చేస్తున్న బంగారపు షాప్ దగ్గరకి వేళ్లి తన చెవుల కమ్మలు ఇచ్చి డబ్బులు తీసుకుంది. ఆ కమ్మలు అంటే సంధ్య కి చాలా ఇష్టం , 10 th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గారు కొనిపెట్టారు, ఆపదలో ఉన్నప్పుడు శత్రువు ని అయినా ఆదుకోవాలి అని వాళ్ళ నాన్న గారు ఎప్పుడు చెపుతుండేవారు . ఊరి ప్రజల కోసం తనకి ఉన్న 10 ఎకరాలు దానం చేసారు అంత గొప్ప మనిషి ఆయన . హాస్పిటల్ కి వెళ్లి డబ్బు కట్టి ఇంటికి బయలు దేరింది సంధ్య. అసలు రోహిత్ ఎవరు ? ఎందుకు ఇలా అయ్యాడు ? 10th ఫస్ట్ వచ్చిన సంధ్య వేశ్య ల ఎందుకు మారింది ? రెండు రోజులకి రోహిత్ స్పృహ లోకి వచ్చాడు రోహిత్ , లేచి చూస్తే హాస్పిటల్ లో ఉన్నడు . కాసేపటికి రౌండ్స్ కి డాక్టర్ వచ్చాడు , డాక్టర్ ని అడిగి జరిగిన విషయం తెలుసుకున్నాడు, ఇంటికి వెళ్లి సంధ్య కి ఫోన్ చేసాడు రోహిత్. ఫోన్ రింగ్ అవుతుంది ...... ఫోన్ లిఫ్ట్ చేసింది సంధ్య. హలో సంధ్య నేను రోహిత్ ... అటు వైపు నుండి ఎలా వున్నావ్ రోహిత్ బాగున్నా సంధ్య నీకు వీలైతే నన్ను కలుస్తావా అని అడిగాడు సరే అంది సంధ్య . ఇద్దరు దగ్గర్లో ఉన్న పార్క్ లో కలిశారు , సంధ్య అడిగింది ఎందుకు ఆ రోజు అల బాధ పడ్డావ్ ఎందుకు ఆహారం తీసుకోవడం లేదు , ఇంటి గోడల మీద ఆ రక్తపు మరకలు ఏంటి అని అడిగింది . నేను ఒక software కంపెనీ లో జాబ్ చేసే వాడిని , మంచి జీతం . రాధికా అనె అమ్మాయిని ప్రేమించా ! ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం. తనకి ఎ కష్టం రాకూడదు అని ఇల్లు కొన్నాను .కానీ కొన్ని రోజులు అయ్యాక సరిగా మాట్లాడేది కాదు ఫోన్ చేసేది కాదు ఏమైందో అని ఆరా తీస్తే వేరే అబ్బాయితో ప్రేమలో ఉందని తెలిసింది, పెళ్లి చేసుకుంటుందట! ఆ బాధని తట్టుకోలేక తాగాడం మొదలు పెట్టాను , అన్నం తినాలని అనిపించేది కాదు , రాత్రంతా మెలుకువ గానే ఉండేవాడిని . ఆరోజు నువ్వు వెనుకనుంచి హాగ్ చేసుకున్నప్పుడు రాధికా గుర్తొచ్చింది .... నేను కోపం గా ఉన్నప్పుడు నా కోపం పోడానికి తను అల చేసేది . అందుకే ఏడుపు వచ్చేసింది అని అన్నాడు ఏడుస్తూ ..... సంధ్య రోహిత్ ని దగ్గరకి తీసుకుని ఓదార్చింది ! రాజేష్ రోహిత్ లాంటి వాడు ఐతె నా జీవితం చాలా బాగుండేది, ఈ వేశ్య వృతి వుండేది కాదు అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది. ఎవరు రాజేష్ ......? సంధ్య వాళ్ల నాన్నగారు మంచి సంబంధం అని చెప్పి చదువు అవ్వకుండానే ముంబాయి లో జాబ్ చేసే రాజేష్ కింద్ ఇచ్చి పెళ్లి చేసారు . ఎన్నో ఆశలతో రాజేష్ ని పెళ్లి చేసుకున్నా సంధ్య కి అంత అశుభాలే జరిగాయి . రాజేష్ తాగుబోతు, తిరుగుబోతు ,డ్రగ్స్ తీసుకునే వాడు , ఆఫీస్ లో జాబ్ పోయింది , సంధ్య బంగారం అంత అమ్మేశాడు ఒక్క చెవి కమ్మలు తప్ప. అది కూడా సంధ్య కమ్మలు అమ్మొద్దని కాళ్ల మీద పడి వేడుకుంది . ఒక రోజు అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి బాగా అవమానించారు . అదే రోజూ రాత్రి రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ తో తాగి ఇంటికి వచ్చాడు , వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకడు నీ పెళ్ళాం చాలా అందంగా ఉంది రా అన్నాడు , రాజేష్ నీకు నచ్చితే నీదే రా సంధ్య ని వాడి మీదకి నెట్టాడు, వాడి నుండి తప్పించుకుని కిచెన్ లోకి పారిపోయింది ,రాజేష్ కిచెన్ లోకి వచ్చి పట్టుకోవాలని చూసాడు కోపమ్ తో అక్కడ వున్న కత్తి తో రాజేష్ ని పొడిచి చంపేసింది . కొన్ని రోజులు జైలు జీవితం గడిపాక సంధ్య వాళ్ళ ఊరు వెళ్ళింది . సంధ్య వాళ్ళ నాన్నగారు సంధ్య జైలుకు వెళ్లినందుకు బాధతో మంచాన పడ్డారు , అప్పులు పాలయ్యారు , సంధ్య వాళ్ళ నాన్న ని డాక్టర్ కి చూపించింది . పరీక్షలు చేసి కాన్సర్ అని చెప్పారు , చాలా డబ్బులు కావాలి నయం కావాలంటే అని చెప్పారు . తను చదువుకున్న చదువుకి ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్యోగం రాదు. తప్పక వేశ్య వృత్రి లోకి దిగింది . కళ్ళు తెరిచి చూసింది రోహిత్ సంధ్య చేతిలో కమ్మలు పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ! ఆశ్చర్య పోయిన సంధ్య నేను వేశ్య ను అని తెలిసిన పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ..... శీలం అనేది మనసుకి వుంటుంది శరీరానికి కాదు , నన్ను ప్రేమగా చూసుకునే మనసు కావాలి నాకు అని చెప్పాడు ..... కొద్దీ రోజుల తరువాత ఇద్దరు పెళ్లి చేసుకుని ఆనందం గా జీవీతాన్ని గడిపారు . సంధ్య వాళ్ళ నాన్న కి కాన్సర్ నయం అయ్యింది ! సంతోషాన్ని మించిన మందు లేదు కదా ! రాత్రి వెనుక పగలు ఎలా వస్తుందో అలాగే కష్టం క సుఖము ఉంటుంది . జీవితం పర్ఫెక్ట్ గా ఉండక పోయిన పర్వాల ఆనందం గా ఉండాలి Regards Bolla Manikanta

No comments:

Post a Comment